భారత దేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ

సిరా న్యూస్;
-నేడు ఆమె వర్ధంతి

ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాస్ట్రపతి చేత ఎన్నిక చేయబడింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.ఉన్నత రాజకీయ కుటుంబంలో సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) (ప్రస్తుతపు ఉత్తర ప్రదేశ్)లోని మొఘల్ సరాయ్ లో జన్మించిన ఇందిర సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది.
భారతదేశ ప్రప్రధమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. 1917 -11-19న అలహాబాదులో కాశ్మీర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినది. తల్లి కమలామనెహ్రూ,తండ్రి జవహర్ లాల్ నెహ్రూ. ఈమెకి ప్రియదర్శని అని పెరు కలదు. బాల చరఖా సంఘాన్ని స్థాపించింది.
1942-3-26న ఫిరోజ్ గాంధీతో వివాహం జరిగింది.తరువాత ఇందిరాగాంధీగా మారింది.
1944-8-20న రాజీవ్ గాంధీ,1946-12-14న సంజయ్ గాంధీలకు జన్మనిచ్చింది.
1955లో కాంగ్రెసులో చేరింది.
1955లోనే అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైనది.
1966-01-10న ప్రధాని లాల్ బహుదూర్ మరణంతో ఆ స్థానానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఎన్నికైనది.
1966-01-24న భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
1967-03-13న కాంగ్రెసుపార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది.
తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది.
1971లో 19 బ్యాంకులను జాతీయం చేసింది.
1971-03-18న ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
గరీబీ హటావో అనే నినాదంతో దేశప్రజలని ఉత్తేజపరిచింది.
1971లో పాకిస్తానుతో యుద్ధం జరగగా, ఓడించింది.1971లోబంగ్లాదేశంని ఏర్పరిచినది.
1973 మేలో సముద్రంలోని తైలనిక్షేపాలను వెలికితీసే సాగర్ సామ్రాట్ ని ఏర్పాటుచేసింది.
ఈమె హయంలో రాజస్థానలోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిపింది.
1975-04-19న తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రయోగం ఈమె హయంలో జరిగింది.
సిక్కిలను భారతదేశంలో అంతర్భాగం చేసింది. రాజభరణాల రద్దు చేసింది.
1975-06-25న దేశంలో అత్యవసరపరిస్థితి విధించినది.
1980-01-14న 4వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
ఈమె హయంలో ఆలీనోద్యమం కొత్తరూపు సంతరించుకుంది.
1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించినది.
సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా.
బిందైన్ వాలాపై దాడికోసం స్వర్ణదేవాలయంలోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు. ఈ దాడియే ఆపరేషన్ బ్లూస్టార్ గా ప్రసిద్ధిగాంచినది.ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20సూత్రాలని కూడా అమలపరిచింది.
1984-10-31న ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా,స్వంత యింటిలోనే మరణించింది.
ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు. ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969,ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972,ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను.

1953లో ఈమె సేవలకు అమెరికా వారిచే మదర్స్ అవార్డ్,
1960లో ఏల్ యూనివర్షిటీ వారిచే హాలెండ్ మెమొరియల్ అవార్డ్,
1965లో ఇటాలియన్ ఇసబెల్లా డిఎస్టె అవార్డులు వరించాయి.
1967,1968లల్లో రెండుసార్లు ఈమెని ఫ్రెంచ్ ప్రజలు ,,మిక్కిలి అభిమాని పాత్రురాలైన నాయకురాలుగా,,ఎన్నుకున్నారు.
అమెరికావారి గ్యాలప్ పోల్ లో ప్రపంచాభిమానిగా ఈమె యావత్ ప్రపంచప్రజల అభిమానాన్ని పొందింది. అక్టోబరు 31న ఈమె నర్థంతిని జాతీయసమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ప్రధానంగా ఈమె హయంలో రాజభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందిననూ 1975 నాటి అత్యవసర పరిస్థితి, స్వర్ణ దేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు బలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *