సిరా న్యూస్,విజయవాడ;
కనక దుర్గ ఆలయంలో సోమవారం నాడు కృష్ణాష్టమి పర్వదినమును పురస్కరించుకొని ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు సమక్షంలో వైదిక సిబ్బంది, అర్చక బృందంచే శ్రీ అమ్మవారి ప్రధానాలయము నందు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణ భగవానులకు షోడశోపచార పూజ, నివేదన, హారతి, నీరాజన మంత్ర పుష్పములు ఇత్యాది పూజా కార్యక్రమాలు జరిపారు.తరువా గోశాలలో గో-పూజ కార్యక్రమములు శాస్త్రోక్తముగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు, , స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, , వైదిక కమిటీ సభ్యులు, వేదపండితులు అర్చకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.