Infidels in Yadadri : యాదాద్రిలో అవిశ్వాసాలు

సిరా న్యూస్,నల్గోండ;
అవిశ్వాస తీర్మానం పెట్టాలని గత నెలలో కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా కలెక్టర్ హనుమంతు జెండాగే ఈనెల 23వ తేదీన అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు నోటీసులు అందజేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి చైర్మన్ పదవి కాంగ్రెస్‌కు వెళుతుందేమోనని గ్రహించి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా పర్వానికి తెర లేపారు.మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల పదవి కాలం 9 నెలలు ఉండటంతో అవిశ్వాసం పై కోర్టును ఆశ్రయించారు. కోర్టు వాళ్ళ స్టే పిటిషన్‌ను కొట్టివేయడంతో అవిశ్వాసానికి ముందే రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. బుధవారం చైర్మన్, వైస్ చైర్మన్‌లు వారి రాజీనామా పత్రాలను జిల్లా కలెక్టర్‌కు అందజేయాల్సి ఉండగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లు రాజీనామా చేయకపోవడంతో రాజీనామా పర్వం పై సందిగ్ధత నెలకొంది. అవిశ్వాస తీర్మానం కౌన్సిల్ మీటింగ్ లోపు రాజీనామా చేస్తారా….? కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.అవిశ్వాస తీర్మానం నెగ్గితే పదవీ గండం ఉందని గమనించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లతో రాజీనామా చేయించాలని నిర్ణయించారు. రాజీనామాల తర్వాత కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి బుజ్జగించాలని యోచించినట్టు తెలుస్తుంది. రాజీనామాలు చేసిన, అవిశ్వాస తీర్మానం నెగ్గిన బీఆర్ఎస్ పార్టీకే చైర్మన్ పదవి దక్కించుకోవాలని శేఖర్ రెడ్డి కౌన్సిలర్లకు సూచించినట్లు సమాచారం. ఏది జరిగిన బీఆర్ఎస్ చైర్మన్ పదవి 30వ వార్డు కౌన్సిలర్ ఖాజా అజీముద్దీన్ దక్కడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. చైర్మన్ పదవి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేజిక్కించుకోవాలని చేస్తున్నప్పటికీ వైస్ చైర్మన్ మాత్రం బీజేపీ,, కాంగ్రెస్ దక్కించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులకు గాను విశ్వాసానికి 31 మంది కౌన్సిలర్లు మద్దతు తెలుపుతున్నారు. అవిశ్వాస తీర్మానం అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కీలకం కానున్నాయి. ఎలాగైనా వైస్ చైర్మన్ పదవి దక్కించుకోవాలని బీజేపీ పార్టీ నుంచి రత్నపురం బలరాం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ పదవి కోసం బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *