సిరా న్యూస్, కుందుర్పి
*చికిత్స కోసం చేయూత
*ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ ఆర్థిక సాయం
పట్టణంలోని స్థానిక వడ్డే కాలనీకి చెందిన అరుణ అనే మహిళా వింత వ్యాధి(ఆమె తల నుండి పాదాల వరకు మచ్చలతో )తో 6నెలలు బాధపడుతుంది. ఎన్నో ఆసుపత్రులకు తిరిగి చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. అప్పులు చేసి చికిత్స చేసిన ప్రయోజనం లేదని బాధిత మహిళా కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు.బాధిత మహిళ కు భర్త లేరు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారడం తో మిత్రుల ద్వారా విషయం తెలుసుకొని చలించిపోయిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ వారికి రూ.20వేల ఆర్థికంగా చేయూత ను అందించారు. ఇందులో మిత్రులు ప్రభంద్, ఏరువాక ఆగ్రో ట్రేడర్ సురేష్,హరి, సురేష్, అబ్దుల్ వాహబ్, లోకేష్, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.