సిరా న్యూస్,మంచిర్యాల;
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల మదర్ తెరిసా పాఠశాలలో హనుమాన్ దీక్ష ధరించిన విద్యార్థిని యాజమాన్యం క్లాస్ రూమ్ లోకి రానివ్వకుండా పాఠశాల బయట నిలుచోబెట్టింది. విషయం తెలుసుకున్న హనుమాన్ దీక్ష స్వాములు పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది.