-
సిరా న్యూస్,మైలవరం;
నూజివీడు రోడ్ లోని ఒక కిరాణా షాప్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 260కేజీల రేషన్ బియ్యాన్ని రెవిన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అమ్మి సొమ్ము చేసుకోవడానికే అక్రమంగా నిల్వ ఉంచినట్లు రెవిన్యూ సిబ్బంది గుర్తించారు. రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని మరో డీలర్ షాప్ కు తరలించారు.
====