నిందితుల వద్ద నుంచి 6 కిలోల గంజాయి స్వాధీనం
అక్రమంగా గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ అశోక్
సిరా న్యూస్,జగిత్యాల;
సమాజంలో డ్రగ్స్ విక్రయిస్తే తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు వినియోగించడం వల్ల కలిగే నష్టలపై యువతకు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు దిశా నిర్దేశం చేసే కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీ (ఏడీసీ)లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.జగిత్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపడం జరుగుతుందని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.గురువారం ఐదుగురు అంతర్ రాష్ట్ర గంజాయి ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులో ఒడిస్సాకు చెందిన ఒకరు, ఏపీకి చెందిన మరొకరు.. ధర్మపురికి చెందిన మొత్తం ముగ్గురు నిందితుల నుంచి ఆరున్నర కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు, రూ.3,500 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు.
విలేకరులతో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్న, సేవించిన, రవాణా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం పోలీస్ వారికి, డయల్ 100 కి సమాచారం అందించి గంజాయి రహిత జిల్లాగా మర్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన జగిత్యాల డి.ఎస్పీ
రఘు చందర్, ధర్మపురి సిఐ ఏ. రామనర్సింహా రెడ్డి, ధర్మపురి, గొల్లపల్లి ఎస్సైలు ఉదయ్ కుమార్ ధర్మపురి, చిర్ర. సతీష్ ,పీసీలు బి.రమేష్ నాయక్ , బి.పూర్ణసాయి, ఎం.రమేష్ , రామ స్వామి, అశోక్ , ఎండి. సలీముద్దీన్, వెంకటయ్య, నవీన్, లను జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అభినందించి రివార్డులు అందించారు. ఈ సమావేశంలో డిఎస్పి రఘు చందర్, సి.ఐ రామ్ నరసింహారెడ్డి రెడ్డి , ఎస్.ఐ లు ఉదయ్ కుమార్ ,సతీష్ , సిబ్బంది పాల్గొన్నారు.