26 మంది ఉద్యోగులు బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన ఈవో పెద్దిరాజు
సిరా న్యూస్,శ్రీశైలం;
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో 26 మంది ఉద్యోగులకు దేవస్థానం స్థానచలనం కలిగించింది. ఇందులో శాశ్వత ఉద్యోగుల, ఒప్పంద ఉద్యోగులు, పొరుగుసేవ ఉద్యోగులు మొత్తంగా 26 మంది ఉద్యోగులను స్థానికంగా బదిలీ చేశారు. శ్రీశైల దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు. అయితే ఏఈవో స్థాయి నుండి ఒప్పంద ఉద్యోగి వరకు ఈవో పెద్దిరాజు బదిలీలు చేయడం విశేషం. అలానే బదిలీ అయిన ఉత్తర్వుల ప్రకారం 24 గంటల్లో ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుండి వారికి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు. ఈ మేరకు పలువు ఉద్యోగులు వారి వారికి కేటాయించిన విధులలో రిపోర్ట్ కూడా సిద్దమయ్యారు..