సిరా న్యూస్,రంగారెడ్డి;
కూకట్పల్లి లో చెరువుల విస్తీర్ణం, ఆక్రమణల పై స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. అయన ఆర్టీఐ ద్వారా చెరువుల వివరాల కొరకు దరఖాస్తు చేసారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక మంత్రి బట్టీ విక్రమార్క హైదరాబాదులో ఉన్న అన్ని చెరువుల సమాచారం ఇచ్చారో అది తప్పుల తడక. హైదారాబాద్ ప్రజలను హైడ్రా పేరుతో భయపెట్టారు. రెవెన్యూ మంత్రి చేసే పని ఆర్థిక మంత్రి పని చేసి హైడ్రా పేరుతో భయపెడుతున్నారు. ఆర్థిక మంత్రి చెప్పిన దానికి, అధికారులు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారానికి పొంతన లేదని అన్నారు.
ఇప్పటికైనా అధికారుల నుండి సరైన సమాచారం తీసుకొని ప్రజలకు తెలియచేయండి. తప్పుడు సమాచారంతో చెరువుల దగ్గర ఉంటున్న ప్రజలను భయ భ్రాంతులను చేయకండి. ఏరియల్ సర్వే కాకుండా,చెరువులను స్వయంగా పరిశీలించి చెరువు విస్తీర్ణం, ఎఫ్ టీ ఎల్ నిర్ధారించాలి. చెరువుల పై సర్వేకు కమిటీ ఏర్పాటు చేసి, ఆ సర్వే కూకట్పల్లి నుండి మొదలుపెట్టండి. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకండి.చెరువులో పట్టా భూములు ఉన్నవారికి నష్ట పరిహారం చెల్లించి, ఆ భూములను స్వాధీనం చేసుకుని, అభివృద్ది చేయండని అన్నారు.