సిరాన్యూస్,ఖానాపూర్
ఇప్పమడలో విద్యుద్ఘాతంతో యువకుడు మృతి
విద్యుద్ఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా బీర్నంది గ్రామపంచాయతీలో ఇప్పమడ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇప్పమడ గ్రామానికి చెందిన తొడసం శ్రీకాంత్ (22) ఇంటి నీళ్ల కోసం మోటార్ స్టార్ట్ చేశాడు.అది పని చేయకపోవడంతో మోటార్‌ను బావిలో నుండి తీసి మోటారు తీసే క్రమంలో కరెంట్ షాక్ తగిలింది. వెంటనే శ్రీకాంత్ అక్కిడిక్కడే మృతి చెందారు. ఈమేరకు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.