టిడిపి నేత బుద్దా వెంకన్న
సిరా న్యూస్,విజయవాడ;
పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చిన విధంగా వాగుతున్నాడు. జగన్ ప్రభుత్వం లో కూడా రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కూడా ఇలాగే కూతలు కూశాడని టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. . ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ కు పాలేరులా పని చేశాడు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. ఇప్పుడు తిరుమల లడ్డూని అపవిత్రం చేసినా పంది కొవ్వు తో పోల్చి మాట్లాడుతున్నాడు. అసలు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా. పంది కొవ్వు గురించి జగన్, విజయసాయి రెడ్డి లకు చెప్పు. గతంలో వారి ద్వారా ప్రజాధనం తిన్నావు. అన్నంలో నువ్వు పంది కొవ్వు వేసుకుంటున్నావా, నెయ్యి వేసుకుంటున్నావా. లాయర్ అయితే ఏదైనా వాగుతావా… నీకు లా పట్టా ఎవరిచ్చారు. నిబంధనలు పాటించని నువ్వు లాయర్ గా అనర్హుడివి. నీలా పట్టా రద్దు చేయాలని కోరుతున్నా. హైకోర్టు సుమోటాగా తీసుకుని పొన్నవోలు పై కేసు పెట్టాలి. న్యాయ వ్యవస్థ కే కళంకితం తెచ్చే పొన్నవోలుకి కోర్టులో అనుమతించ కూడదు. నువ్వు ఇంకో ఒక్కసారి వాగితే .. నీకు తగిన బుద్ధి చెబుతాం. దమ్ముంటే నా పై కేసు పెట్టుకో.. న్యాయదేవత సాక్షి గా నీ సంగతి తేలుతుంది. భూమన కరుణాకర రెడ్డి నిన్న తిరుమల పై డ్రామా ఆడాడు. వెంకటేశ్వర స్వామి ఆస్తులను కొల్లగొట్టిన నువ్వా ప్రమాణం గురించి మాట్లాడేది
రక్తం కక్కుకుని చస్తా అంటున్నావు..దేవుడు వెంటనే శిక్షించడు. కానీ నీకు ఆ దేవుడు తప్పకుండా బుద్ధి చెబుతాడు. నేను హిందువు అంటున్నావు.. క్రైస్తవ పద్దతిలో మీ ఇంట్లో పెళ్లి చేయలేదా. నీకు నచ్చిన మతం తీసుకో..కానీ వెంకన్న కు అపచారం చేస్తే ఊరుకుంటామా. ఇంత జరుగుతుంటే ధర్మారెడ్డి ఏమయ్యాడు… మాట్లాడడా. లడ్డు వ్యవహారం లో నోటి కొచ్చినట్లు వాగితే ప్రజలు చెప్పులతో కొడతారు. పొన్నవోలు… బుద్ధి ఉన్నవాడు ఎవడైనా నీలాగా మాట్లాడతాడా. నీకు పాపం పండింది… శిక్ష అనుభవించడానికి సిద్దం గా ఉండు. రాష్ట్రం లో ఉన్న ఆలయాలను అపవిత్రం చేయడానికి జగన్ ప్రయత్నం చేశాడు. అసలు పందికొవ్వు , నెయ్యి… బంగారం, ఇత్తడి తో పోలికేంటి పొన్నవోలని నిలదీసారు.
మదమెక్కి తిక్క ఎక్కి, జగన్ కోసం వాగుతున్నాడు. నువ్వు మోకాళ్ల మీద నిలబడి క్షమాపణ కోరాలి. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి చంద్రబాబు పై విమర్శలు చేశాడు. బార్ అసోసియేషన్ లు కూడా ఆలోచనలు చేయండి.. పొన్నవోలు ను సస్పెండ్ చేయండి. హైకోర్టు కూడా స్పందించి పొన్నవోలును ప్రాసిక్యూట్ చేయాలి. దేశంలో ముగ్గురు ఐపియస్ అధికారులు సస్పెండ్ అయిన చరిత్ర ఎపిలోనే జరిగింది. పి.యస్.ఆర్ ఆంజనేయులు ను అరెస్టు చేసి విచారణ చేయాలి. ఇంటిలిజెన్స్ అధికారిగా కాకుండా మాఫియా డాన్ గా పని చేశాడు .ప్రభుత్వ అధికారిగా ఉండి.. జగన్ కు అనుచరుడిగా వ్యవహరించాడు. ఒక అమ్మాయి కి అన్యాయం చేసిన ముగ్గురు ఐపియస్ అధికారులను అరెస్టు చేయాలి. చాలా మంది అధికారులు జగన్ కు తొత్తులుగా పని చేశారు. ధర్మారెడ్డి కూడా ప్రతిపక్ష నేతలు తిరుమల వెళితే ప్రోటోకాల్ పాటించలేదు. ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నా బయటకి రావాలి. వివేకా తరహాలో ఆయన్ని కూడా చంపేశారనే అనుమానం మాకు ఉంది. ధర్మారెడ్డి ప్రజల్లోకి వచ్చి అప్పుడు జరిగిన విషయాలు చెప్పాలని అన్నారు.