సిరా న్యూస్,కడప;
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలో ఉన్న ప్రముఖ కాంట్రాక్టర్ కేసి పుల్లయ్య ఇంటిలో , వారికి సంబంధించిన వ్యాపార లావాదేవీల సంస్థల్లో ఐటి అధికారులలు సోదాలు జరిపారు. గురువారం తెల్లవారుజామున నుంచి ఐటీ అధికారులు ఏకకాలంలో కేసి పుల్లయ్య సంస్థల్లో సోదాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వందల కోట్ల నిర్మాణ పనులు కేసీ పుల్లయ్య సంస్థలు చేస్తున్నాయి. ప్రొద్దుటూరులో కూడా కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు చేస్తున్నాయి