కొల్లు రవీంద్ర
సిరా న్యూస్,మచిలీపట్నం;
మచిలీపట్నం నియోజకవర్గం 12వ డివిజన్ భాస్కరపురంలో మాజీ మంత్రి తెదేపా జనసేన ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన పలు కుంటుబాలు వారిలో నూకల రాధాకృష్ణ (బాలకృష్ణ), నిమ్మగడ్డ వాసు, కొమ్మన బాబ్జి, నూకల తేజ రామ్, తెదేపా కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు.
కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజా సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వము ఏర్పాటు చేసుకుందాం బందరును అభివృద్ధి చేసుకుందాం. బందరు అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం. పార్టీ లోకి చేరే ప్రతి ఒక్కరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు ఒక సైనికుల్లా పని చేద్దాం. గెలుపు కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకి గుర్తింపుని ఇస్తాం. ఈ 30 రోజులు పార్టీ కోసం కష్టపడండి మిగతా 5 సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతాం. కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐపిసి కరుణ్ కుమార్, నగర అధ్యక్షులు ఇలియాస్ , ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల వెంకన్న ,డివిజన్ ఇంచార్జ్ బొమ్మిడి శ్రీరాములు , నాయుడు తులసి,పల్లపటి సుబ్రమణ్యం,తలారి రాంబాబు,దేవన బోయిన శ్రీను ,సలీం ,అయ్యప్ప ,యువరాజు ,శివ ,అశోక్ ,రమణ, తదితరులు పాల్గొన్నారు.