ఐటీ మినిస్టర్ రచ్చ…

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క.. అలాగే మంత్రులుగా ఇతర సీనియర్ నేతలు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే మరికొన్ని మంత్రిత్వ శాఖలకు కాంగ్రెస్ తమ అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎక్కడా చూసినా ఐటీ మినిస్టర్ ఎవరూ అనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో కేటీఆర్‌ ఐటీ మంత్రిగా పనిచేసి మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఐటీ మంత్రిగా ఎవరూ వచ్చినా కూడా వారిని కేటీఆర్‌తో పోలుస్తారు. ఆయన స్థాయిలో బాధ్యతలు నిర్వహించపోతే తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్లింగ్ జరుగుతుంది. అయితే ఐటీశాఖ కు ఎవరిని మంత్రిని చేయాలనే దానిపై కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేదా శ్రీదర్ బాబు కు ఐటీ శాఖ ఇచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ తన మంత్రివర్గంలో మరో ఆరుగురు మంత్రుల్ని తీసుకోవాల్సి ఉంది. మరికొన్ని రోజుల్లో మంత్రివర్గాన్ని కూడా విస్తరించనున్నారు. అయితే ఈ మంత్రివర్గంలోకి మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్‌ రెడ్డి అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్‌మోహన్‌ రావులను తీసుకోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లిద్దరిలో ఎవరకైనా మంత్రి పదవి దక్కినా వారిని ఐటీశాఖ మంత్రిగా కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్‌మోహన్‌రావుకు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని నడుపుతున్నారు. అమెరికాలో ఈయనకు ఐటీ బిజినెస్‌ను కూడా ఉంది. గతంలో రాహుల్‌గాంధీ టీంలో పనిచేసిన ఈయన కాంగ్రెస్‌ పార్టీకి ఐటీ పరంగా కూడా సేవలందించారు. సభ్యత్వ నమోదు అలాగే ఎన్నికల్లో అనలిటిక్స్‌ వంటి విషయాల్లో మదన్‌మోహన్‌ రావు పార్టీ కోసం ఎంతో కృషి చేసినట్లు తెలుస్తోంది. అందుకే మదన్‌మోహన్‌రావుకు ఐటీ శాఖ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యువతకు అలాగే వ్యాపార రంగంలో పరిచయాలు ఉన్నవారికి ఐటీ శాఖ కేటాయిస్తే కేటీఆర్‌కు ధీటుగా వారు పనిచేయగలరని యువత భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *