సిరా న్యూస్, ఉట్నూర్:
సపోట తోట ఫలసాయం వేలం
+ ఉట్నూర్ నర్సరీలో వేలానికి సిద్దంగా 128 చెట్లు
+ 19న ఐటీడీఏ పీవో కార్యాలయంలో వేలం
+ ప్రకటన జారీ చేసిన పీవో చాహత్ బాజ్‌పాయ్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఇటీడీఏ పరిదిలోని ఉద్యానవన నర్సరీలో గల సపోట చెట్ల ఫలసాయాన్ని వేలం వేయనున్నట్లు ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. మంచి యాజమాన్య పద్దతులు పాటించి సాగు చేసిన 128 చెట్లను వేలం వేయనున్నట్లు ప్రకటించారు. సంవత్సరం పాటు రెండు పంటలకు కలిపి వేలం పాట ఉంటుందని, ఆసక్తిగల వ్యాపారస్తులు, సంస్థలు వేలం పాటలో పాల్గొనాలని కోరారు. ఈ నెల 19న సాయంత్రం 4గంటలకు ఐటీడీఏ కార్యాలయంలో వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎలాంటి ముందస్తు దకఖాస్తు అవసరం లేదని నేరుగా వేలం పాటలో పాల్గొనవచ్చని పీవో పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఐడీడీఏలోని ప్రాజెక్ట్ హర్టికల్చర్ ఆఫీసర్ సంప్రదించాలని అన్నారు.