ఆదిలాబాద్, సిరా న్యూస్
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నాయకులు జాదవ్ శ్రావణ్ నాయక్ గాంధీభవన్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన బయోడేటా అందజేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు మొయిన్ అహ్మద్, ఆడే సునీల్, గోవింద్ భూక్య ఉన్నారు.