సిరా న్యూస్, ఆసిఫాబాద్:
ఆసిఫాబాద్ లో జాదవ్ రాజేష్ బాబు ప్రచార రథాలు…
+ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న జాదవ్ విజయ్ కుమార్
+ “దేశం కోసం… ధర్మం కోసం…” మరోసారి మోడీని ప్రధానమంత్రి చేయాలని ప్రచారం
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఎల్లారం గ్రామంలో గురువారం జాదవ్ రాజేష్ బాబు ప్రచార రథాలు హోరెత్తించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గురించి వివరిస్తూ ప్రచార రథాలు గ్రామంలో తిరిగాయి. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు తనయుడు జాదవ్ విజయ్ కుమార్ ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. నిరుపేదలు, రైతులు, యువకులు, మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడో సారి బిజెపి అధికారంలోకి రావాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈసారి బిజెపి నాయకత్వం ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల బరిలో నిలిచేందుకు జాదవ్ రాజేష్ బాబు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సర్వేలన్నీ జాదవ్ రాజేష్ బాబుకు అనుకూలంగా ఉన్నాయని, బిజెపి పెద్దల ఆశీర్వాదం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.