Jadhav Rajesh Babu: జాదవ్‌ రాజేష్‌ బాబుకు టికెట్‌ కన్ఫామ్‌!?

సిరా న్యూస్, ఆదిలాబాద్‌:

జాదవ్‌ రాజేష్‌ బాబుకు టికెట్‌ కన్ఫామ్‌!?
+ టికెట్‌ లాంచనమే అంటున్న విశ్లేషకులు
+ త్వరలోనే ప్రకటించే అవకాశం

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ కోసం వడపోతలు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీ సంకల్ప్‌ యాత్ర తరువాత అదిష్ఠానం తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీజేపీ మొదటి జాబితాలో ఆదిలాబాద్‌ పేరు లేకపోవడంతో, ఆదిలాబాద్‌ విషయంలో బీజేపీ పెద్దలు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వినికిడి. దాదాపు 40మంది ఆశావాహులు ఎంపీ టికెట్‌ కోసం పోటీ పడుతుండగా, వారిలోంచి ముగ్గురిని ఫైనల్‌ చేసినట్లు సమాచారం.

జాదవ్‌ రాజేష్‌ బాబుకే మొగ్గు…
ఫైనల్‌ లిస్ట్‌లో ఉన్న మిగిలిన వారితో పోల్చుకుంటే భైంసా మార్కెట్‌ కమీటీ మాజీ చైర్మెన్, బీజేపీ నాయకులు జాదవ్‌ రాజేష్‌ బాబుకే టికెట్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారితో పోలీస్తే జాదవ్‌ రాజేష్‌ బాబుకు ఉన్న క్లీన్‌ ఇమేజ్‌తో పాటు ప్రజల్లో ఉన్న క్రేజ్‌ ప్లస్‌గా మారే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా రాజేష్‌ బాబు ప్రత్యేక ప్రచార రథాలతో కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి గ్రామాల్లో ప్రచారం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తీస్రీ బార్‌ మోడీ సర్కార్‌ నినాదంతో ఆయన చేపడుతున్న ప్రచార కార్యక్రమాలు పార్టీ పట్ల ఆయన విధేయతకు నిదర్శంగా నిలుస్తున్నాయి. వీటికి తోడు ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజవర్గం పరిదిలోని మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్‌ కూడ ఆయనకు స్పష్టంగా ఉండటంతో, పార్టీ అదిష్ఠానం రాజేష్‌ బాబు వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రాజేష్‌ బాబుకు టికెట్‌ లాంచనమేనని ఆయన అభిమానులు చెబుతున్నారు.

హైద్రబాద్‌లో తిష్టవేసిన లోక ప్రవీణ్‌ రెడ్డి అండ్‌ టీం…
ఎంపీ టికెట్‌ కోసం అన్ని అర్హతలు జాదవ్‌ రాజేష్‌ బాబుకే టికెట్‌ కేటాయించాలని బీజేపీ అదిలాబాద్‌ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌ రెడ్డి, బీజేపీ పార్టి జిల్లా ఉపాధ్యాక్షులు సామ సంతోష్‌ రెడ్డి, ఎంపిటీసీ లోక కరుణాకర్‌ రెడ్డి, వివిద మండలాల బీజేపీ నాయకులు ఇటీవలే రాష్ట్ర అధినాయకత్వాన్ని కలిసి విన్నవించారు. ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా, ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్న జాదవ్‌ రాజేష్‌ బాబుకు టికెట్‌ కేటాయిస్తే, ఆదిలాబాద్‌లో గెలుపు ఖాయమని నాయకత్వానికి వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి, పార్లమెంటరీ బోర్డ్‌ మెంబర్‌ డా. కే లక్ష్మణ్, స్టేట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ చంద్రశేఖర్‌ ఆజాద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావులతో పాటు ఇతర నాయకులను కలిసి జాదవ్‌ రాజేష్‌ బాబుకే టికెట్‌ కేటాయించాలని విన్నవించారు. కాగా అన్ని అర్హతలు ఉన్న రాజేష్‌ బాబుకు ఈ సారి ఎంపీ టికెట్‌ ఖాయమని వారంత చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *