సిరా న్యూస్,బేల
ఎస్‌జీటీయూ మండల అధ్యక్షులుగా జగదీష్
* బేల నూతన కమిటీ ఎన్నిక
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం బేల మండల నూతన కమిటీ సోమవారం ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా మలపతి.జగదీష్ ప్రధాన కార్యదర్శిగా జి.విష్ణుకాంత్, ఆర్థిక కార్యదర్శిగా కె.బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షులు గడుగు.నరేందర్ ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు చౌటుపల్లి వెంకటేష్, పులిగిరి.సాయికృష్ణ, రూపవత్.మదన్ లాల్, విట్టోభా తదితరులు పాల్గొన్నారు.