సిరాన్యూస్, కుందుర్పి
ఓటు యుద్ధానికి.. సిద్ధం కండి: సర్పంచ్ మసాలా జగన్
వైసిపి నాయకులు ఓటు యుద్ధానికి.. సిద్ధం కావాలని గ్రామ సర్పంచ్ మసాలా జగన్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ మహంతపురం గ్రామపంచాయతీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణలను అత్యధిక మెజార్టీ సంపాదించాలని వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అవినీతి రహితంగా పని చేస్తున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి వేయించి మన పంచాయతీ నుండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో మహంతపురం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.