-బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
-మంథని బిఆర్ఎస్ నాయకుల డిమాండ్
సిరా న్యూస్,మంథని;
బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని మంథని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏగొలపు శంకర్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య డిమాండ్ చేశారు. సోమవారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారడం సిగ్గుచేటని వారు తీవ్రంగా మండిపడ్డారు. జాగృతి అధ్యక్షురాలు కవిత అండతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. అధికార పార్టీలో చేరాలనుకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి చేరాలని అంతేతప్ప ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలో చేరడం సరికాదని వారు అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తక్షణమే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు క్షమాపణ కోరాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే అధికార పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్ కాయితి సమ్మయ్య, ఎంపీటీసీ చెరుకు తోట ఓదెలు, జనగామ సంతోష్, వేముల లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు
===================