సిరా న్యూస్,విశాఖపట్నం;
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై విధించిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికుల అరెస్టులు ఆపాలని, అంగన్వాడి, మున్సిపల్, సర్వ శిక్ష కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ప్రదర్శన, జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కోవలో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకొని అరెస్టు చేశారు అంగన్వాడీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది