సిరా న్యూస్, జైనథ్:
జైనథ్ గ్రామ పంచాయతీలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఈ మేరకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… అంబేద్కర్ సేవలను కొనియాడారు. భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన ఆయనకు దేశం ఎల్లప్పుడు రుణపడి ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని, జీవితంలో ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ముజీబ్, ఎంపిటిసి కొడిచర్ల సుదర్శన్, మాజీ సర్పంచ్ దుమాల దేవన్న, నాయకులు వెంకట్ రెడ్డి, లస్మన్న, కారోబార్ ఆనంద్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.