సిరా న్యూస్, జైనథ్
కంది శ్రీనివాస్ రెడ్డి ని ఘనంగా సన్మానించిన జైనథ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంరెడ్డి
జైనథ్ మార్కెట్ కమిటీకీ నూతనంగా నామినేట్ చేయబడ్డ కాప్రి గ్రామానికి చెందిన ఎల్మ రాంరెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డిని ప్రజా సేవ భవన్ లో ఘనంగా సన్మానించారు.చిన్న నాటి బాల్య మిత్రుడు అయిన తనను కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నందుకు గుర్తించి జైనథ్ బేల మండలాల ఉమ్మడి డైరెక్టర్ గా నియమించి నందుకు కాంగ్రెస్ పార్టీకీ కంది శ్రీనివాస్ రెడ్డికి ఋణ పడి వుంటానని తెలిపారు. మార్కెట్ , రైతుల అభివృద్ధి కోసం పాటు పడతానని ప్రజా సేవ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు.