సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలంలోని ముద్దనపల్లి గ్రామంలో యాదేచ్చగా గా సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి జల్లికట్టు జరిపారు.
జల్లికట్టు నిర్వహణకు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పశువులను నడి బజార్లో, జల్లికట్టు పేరుతో, హింసిస్తూ పరుగుపందెము చేపడుతూ, ప్రైజులు పెట్టించి, గోవులకు వేడుకగా వాటికిప్రభలు కట్టించి, నడి వీధిలో జల్లికట్టు ఉత్సవాలలో పరిగెతిస్తారు. ప్రమాదకరమైన జలకటును వేడుకగా కొంతమంది రాజకీయ నేతల వత్తాసులతో జరుపుకున్నారు. తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల నుండి భారీ ఎత్తున ఎద్దులను తరలించి జల్లికట్టు నిర్వహించారు.