సిరాన్యూస్, బేల
ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన జమాతే ఇస్లామీ హింద్ నాయకులు
అదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగ్వి గ్రామంలో సోమవారం జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి చుట్టుపక్కల గ్రామాల నుండి గిరిజనులు భారీగా తరలివచ్చారు.ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపుగా 100 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ ఎండి నదీమ్ హర్షద్ మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు సేవలు చేయడమే జమాత్ ఇస్లామి హింద్ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు.కేవలం ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఈమధ్య కేరళ రాష్ట్రంలో వరదలు వస్తే మా వంతుగా కొంత సహాయాన్ని చేయడం జరిగింది అని అన్నారు.మత విభేదాలు లేకుండా ఎక్కడ సాహయం అవసరం ఉంటుందో అక్కడ మా సంస్థ ముందుంటుందని పేర్కొన్నారు. ప్రతి మనిషిలో ఆరోగ్య కారణాలవల్ల అనేక సమస్యలతో సతమతమవుతున్న నేటి సమాజం కోసం చేయూతనివ్వడం మా సంస్థ లక్ష్యం అని పేర్కొన్నారు.బీపీ,షుగర్ లాంటి వ్యాధులకు సాధారణమైన వైద్యంతో అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి డేర్ సంస్థ వైద్య బృందం నిపుణులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 100 మందికి పైగా రోగులకు గుండె, కిడ్నీ,నరాలు, కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించినమని అన్నారు.ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చినటువంటి డేర్ సంస్థ వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేల మండల మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్, అల్లా బకష్, జాకీర్,జావిద్ తదితరులు పాల్గొన్నారు.
