Jamini: జామినిలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

సిరాన్యూస్‌, జైనథ్
జామినిలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని జామిని ప్రాథమికొన్నత పాఠశాలలో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి ఇటీవలే బదిలీ పై వెళ్లిన‌ తొమ్మిది మంది ఉపాధ్యాయులకు సోమ‌వారం ఉపాధ్యాయులు,విద్యార్థులు, గ్రామస్తులు ఘనంగా స‌న్మానించారు. ఈసంద‌ర్బంగా ఉపాధ్యాయుల‌కు పూల‌మాల‌లు, శాలువాతో స‌త్క‌రించి ఘనంగా వీడ్కోలు ప‌లికారు. జామిని ప్రాథమికొన్నత పాఠశాలలో గత తొమ్మిది సంవత్సరాలుగా తొమ్మిది మంది ఉపాధ్యాయులు హరీష్, రాములు,బాదల్, ప్రతాప్ సింగ్, రాజేశ్వర్, అరుణ్ రాజ్, మధావ్, ఉపేందర్ ల సేవాలనూ గ్రామస్తులు కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉంద‌ని, క్రమశిక్షణ బాటలో విద్యార్థులను నడపాలని ప్రధానోపాధ్యాయులు శరత్ కుమార్ యాదవ్ అన్నారు. విద్యార్థులు, గ్రామస్తులు కొత్తగా బదిలీపై జామిని ప్రాథమికొన్నత వచ్చిన ఉపాధ్యాయులు జయశ్రీ, జ్యోతి, గంగన్న, పెంటపర్తి ఊశన్న లను కూడా సన్మానం చేశారు.అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ నైతం దేవుబాయి, మాజీ సర్పంచ్ పెందూర్ మోహన్, ఐటిడిఏ డైరెక్టర్ కూర్సేంగ తానాజీ, గ్రామ యూత్ మెంబర్స్ రాజు, కృష్ణ, సంతోష్, ప్రభాకర్, అవినాష్, ధర్మూ, జగన్నాథ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *