Jan Aushadhi: ప్రధానమంత్రి జన ఔషది కేంద్రం ప్రారంభం

సిరా న్యూస్,కళ్యాణదుర్గం
ప్రధానమంత్రి జన ఔషది కేంద్రం ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘమునకు ఇచ్చిన ప్రధానమంత్రి జన ఔషది కేంద్రాన్ని త్రీసభ్య కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభిచారు.ఈ సంద‌ర్బంగా సంఘపు అధికారులు మాట్లాడుతూ చాపిరి పీఏసీఎస్ జన ఔషది కేంద్రంలో అన్ని రకముల ఔషద మందులు 50శాతం నుండి 90శాతం వరకు తక్కువ ధరల్లో లభించునని తెలియజేశారు. కళ్యాణదుర్గం మండల పరిధీలోనే చాపిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యులకు ఇచ్చిన స్వల్ప కాలిక దీర్ఘ కాలిక, కమర్షియల్ క్రాప్ రుణములను ఈ నెల మార్చి 31 వ తేది లోపు రెన్యువల్ చేసుకో వలదిందిగా సంఘపు సీఈఓ తెలియజేశారు. వడ్డి చెల్లించి రెన్యువల్ చేసుకున్న రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకున్న వారికి రాయితీలు వర్తిస్తాయన్నారు. సంఘంలో ఓటు హక్కు కలిగిన సంఘ సభ్యులు ఈ కేవైసీకోసం ఆధార్ కార్డు జిరాక్స్ ,రేషన్ కార్డు జిరాక్స్,పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్,బ్యాంకు అకౌంట్ బుక్,రెండు పాసు ఫోటోలు ఇవ్వాల‌ని తెలిపారు.ఈ కార్యక్రమములో త్రిసభ్య కమిటీ సభ్యులు బి.వెంకటేషులు, వై శివలింగారెడ్డి, జి. రామాంజినేయులు సబ్ డివిజినల్ అధికారి నాగభూషణ రెడ్డి, ఏడీసీసీ బ్యాంకు మేనేజర్ హనుమంతరాయడు, సూపర్వైజర్ పవన్, సీఈఓ టి. నారాయణస్వామి వెంకప్ప సిబ్బంది సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *