సిరా న్యూస్,జన్నారం
జన్నారంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు
ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ప్రత్యేక తెలంగాణా తొలి, మలి దశ పోరాట వీరులు బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ భాపూజీ 12 వ వర్ధంతి శనివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ
మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా తీర్యాణి ప్రాంతంలో జన్మించారని, వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి బిసి నాయకుడుగా ఎదిగారని అన్నారు. కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం కరీంనగర్ జోన్ కన్వీనర్ కె ఏ నరసింహులు , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య , కో కన్వీనర్ కడార్ల నరసయ్య, మూల భాస్కర్ గౌడ్ , మామిడి విజయ్ . మంచిర్యాల జిల్లా కో కన్వీనర్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ , రేండ్లగూడ మాజీ సర్పంచ్ మాజీ ఎంపిటిసి అల్లం వెంకట్ రాజం ,ముదిరాజ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు దండెవేణి శ్రీధర్ , మున్నూరు కాపు సంఘం పొనకల్ పట్టణ ఉపాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ , మంచిర్యాల డివిజన్ మోకు దెబ్బ అధ్యక్షుడు ఒళ్లాల నరస గౌడ్ , బాలిన రాము, విష్ణు ఆర్టిఏ కన్సల్టెంట్, బొద్దుల అంజన్న, ఎరుకల రమేష్ గౌడ్, కూడల శ్రీధర్ రావు, దోశ పరశురాం, నడిమెట్ల నరేందర్, శెట్టిపల్లి కృష్ణ, అయ్యోరు రవి, కందుల రమేష్, కుందారపు శేఖర్, కొత్త శ్రీనివాస్ , కోటేశ్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.