– యూటీఎఫ్ పిలుపు
సిరా న్యూస్,బద్వేలు;
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 28న ఆదివారం ఉదయం 10 గంటలకు జరగబోవు రాష్ట్రస్థాయి విద్యాసదస్సును జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు కోరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుటిఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా రాష్ట్రమంతటా స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయని ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా వివిధ జిల్లాలలో సమకాలీన అంశాలపై రాష్ట్రస్థాయి సదస్సులు నిర్వహించి ఉపాధ్యాయులను చైతన్య పరచడం జరుగుతున్నదని తెలిపారు 2024 మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర పరిస్థితులను శ్వేత పత్రాల రూపంలో ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నదని మరి శ్వేత పత్రాలలో వాస్తవ విషయాలు తెలియచేయటం జరుగుతున్నదని తెలిపారు ఇటీవల విడుదల చేసిన ఆర్థిక శ్వేత పత్రం కూడా ఇలాగే ఉందని గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా కారణమని తెలిపారు ఈ నేపథ్యంలో దేశ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై అవగాహన కలిగించే నిమిత్తం ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల బాలాజీ నగర్ నందు రాష్ట్ర విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్థిక శ్వేత పత్రం వాస్తవాలు అన్న అంశంపై భక్తగా శ్రీ వి రాంభూపాల్ గారు అలాగే ప్రత్యామ్నాయ విద్యా విధానం అన్న అంశంపై యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె ఎస్ ఎస్ ప్రసాద్ గారు వివరిస్తారని తెలిపారుజిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యా సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏజాస్ అహ్మద్ ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్ నాయకులు గోపీనాథ్ వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు