సిరాన్యూస్,జైనథ్
మద్యానికి బానిసై జేసీబీ ఆపరేటర్ తుకరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఆత్మహత్య
మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సిర్సన్న (జె) లో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనథ్ మండలంలోని సిర్సన్న (జె) గ్రామానికి చెందిన తుకరెడ్డి ప్రవీణ్ రెడ్డి (26) అనే యువకుడు జేసీబీ ఆపరేటర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో తాగుడుకు బానిసగా మారాడు. దీంతో సోమవారం రాత్రి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.గమనించిన కుటుంబీకులు ప్రవీణ్ రెడ్డిని రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.