Jeevan Reddy: మావోయిస్టులు వనాన్ని వదిలి జనంలోకి రావాలి:  డీఎస్పీ జీవన్ రెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
మావోయిస్టులు వనాన్ని వదిలి జనంలోకి రావాలి:  డీఎస్పీ జీవన్ రెడ్డి

కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ తెలంగాణలో మనుగడని ఎప్పుడో కోల్పోయిందని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కావాల‌ని, అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామ‌ని తెలిపారు.కుటుంబ సభ్యులతో గడపవలసిన విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోవడం తప్ప సాధించింది ఏమీ లేదన్నారు. మిగిలిన జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా జీవించాల‌న్నారు. ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని బోథ్ మండ‌లంలోని పొచ్చెర గ్రామానికి చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ , బజార్హత్నూర్ మండలం డెడ్రా గ్రామానికి చెందిన దాసరి వార్ సుమన అలియాస్‌ సంగీతక్క జనంలోకి రావడానికి పోలీసులు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు.మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం పని చేసే నాయకులు, దళ సభ్యుల కోసం వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా మీ కుటుంబ సభ్యుల కోసం మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల ప్రతిఫలాలను అందజేసి, పునరావాసం కల్పించే విధంగా పోలీస్ శాఖ కృషి చేస్తుందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *