సిరా న్యూస్,ఏలూరు;
అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గిరిజన భవన్ లో జాబ్ మేళా ఏర్పాటు చేసారు. జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ, యువకులు హాజరై వారి క్వాలిఫికేషన్ కు తగ్గ ఉద్యోగాలను ఎంచుకున్నారు. జాబ్ మేళాకు కొన్ని కంపెనీలు హాజరైన వారికి కావలసిన క్వాలిఫికేషన్ ఉన్న యువతి ,యువకులను సెలెక్ట్ చేసుకున్నారు. జాబ్ మేళాకు వచ్చిన యువతీ ,యువకులకు వారి పెద్దలకు భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.
ఈ విధంగా మా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కృషి చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కి యువతీ, యువకులు ధన్యవాదాలు తెలియజేశారు.