జోగి రమేష్ ది అడుగడుగున అధికార దుర్వినయోగం

సిరా న్యూస్,మచిలీపట్నం;
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య క్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మీడియాతో మాట్లాడారు. అధికారం అడ్డుపెట్టుకొని జోగి రమేష్ కుటుంబ సభ్యులు చేసిన అక్రమాలు పుట్టాలోనుంచి పాము లు బయటకు వచ్చినట్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు పక్షాన నిలబ డదామని 2019 కి ముందు ఊరు రా తిరిగి ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేశారు. విజయవాడ రూరల్ లోని అంబా పురం గ్రామంలో అగ్రిగోల్డ్ కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయని స్పష్టంగా జీవో నెంబర్ 117 మరియు 113 లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందుగా ఈడీ అటాచ్మెంట్ లో ఉన్న భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, తమ్ముడు జోగి వెంకటేశ్వర్ల పేర్లు మీద సర్వే నంబర్ 88 లోని 2160 చ. గ.ప్రజలకు భూమిని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన సర్వే నెంబర్ 88 నుండి 87లోకి మార్చాలాంటూ జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ దరఖాస్తు చేసుకొని ఆ రికార్డులు మార్చేసి ఆ భూమిని సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించడం జరిగింది. భూమి విషయంలో అడుగడుగున జోగి రమేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని అన్నారు.
===========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *