జోగి రమేష్ కొడుకు ఏమన్నా స్వాతంత్ర్య సమరయోధుడా

సిరా న్యూస్,విజయవాడ;
మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు ఏమన్నా స్వాతంత్ర సమర యోధుడా అని టీడీపీ కార్యదర్శి బుద్దా వెంకన్న ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అక్రమంగా కొనుగోలు చేశారు. అందుకే అరెస్టు చేసారు. సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనకూడదు. అక్రమంగా కొన్నారు కనుకే అరెస్టు చేశారని అన్నారు. అరెస్టుపై జోగి రమేష్ స్పందిస్తూ వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడిపై కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చి దౌర్జన్యం చేసినందుకు నీకు మంత్రి పదవి వచ్చింది.
జోగి రమేష్ కొడుకు అమెరికా వెళ్లి ఎంఎస్ చదివాడు. ఎంఎస్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనడమా. గౌడ కులస్తుడిని అని చెబుతున్నావు ,ఎంత మంది గౌడ విద్యార్థులను ఎంఎచస్ చదివించావ్? చంద్రబాబు కక్ష సాధించే స్థాయి వ్యక్తివి నువ్ కాదు. అవినీతి చేస్తే చూస్తూ ఊరుకోవాలా?అరెస్టు చేయకుండా వదిలేయాలా? అవినీతి కేసు లో ఉంటే కులాన్ని అడ్డు పెట్టుకోవడం సిగ్గు చేటు. నేను బీసీ వ్యక్తిగా అడుగుతున్న ,జప్తు ఆస్తులు కొనొచ్చా? ఈడి,సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనొచ్చు అని మీ నాయకుడు జగన్ తో చెప్పించు. చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చావనే నీకు మంత్రి పదవి దక్కింది. జగన్ మిమ్మల్ని భస్మాసురుల్ల తయారు చేశాడు. మీ పాపలు పండాయి కనుకనే మీ ప్రజలు మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసారని అన్నారు. మీ ఆస్తులు కోసం బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. జప్తు ఆస్తులు బలహీన వర్గాలు కొంటారా?కోనొచ్చు అని మీ నాయకుడితో చెప్పించు . పెడన లో నువ్వు చేసిన అవినీతికి నిన్ను అక్కడి నుంచి పెనమలూరు వచ్చావు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో తెదేపా అభ్యర్థి నీపై గెలిచారని అన్నారు.
బీసీ పిల్లవాడిని పెట్రోల్ పోసి చంపేస్తే అప్పుడు నీకు కులం గుర్తు రాలేదా, కనీసం ఖండించావా. తెదేపా బలహీన వర్గాల నాయకులు ఎంతో మంది వారి కులాలకు గౌరవం తెచ్చారు. నువ్వు కులం గౌరవం తీస్తున్నావు. తప్పులు చేసి కులాన్ని అడ్డుపెట్టుకోవడం సరి కాదు. చంద్రబాబుకు నీ గురించి ఆలోచించే సమయం లేదు. రాష్ట్రంలో జగన్ చేసిన విద్వంసం ,నుంచి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారని అన్నారు.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *