సిరాన్యూస్, ఆదిలాబాద్
బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలోని హిమామ్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొదట రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పండగ నేపథ్యంలో వ్యర్ధాలను మున్సిపల్ ట్రాక్టర్లకు మాత్రమే అందించాలని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మున్సిపల్ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా బక్రీద్ పండగను పూర్తి ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ జెయిర్ రంజాన్ , మున్సిపల్ కమిషనర్ కమ్రాన్ హైమద్, మంజూరు మౌలానా పాల్గొన్నారు