సిరా న్యూస్, జైనథ్:
దీపాయిగూడ రామాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న ప్రత్యేక పూజలు…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలోని రామాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంగా భాగంగా దీపాయిగూడ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు రామన్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.