సిరా న్యూస్, ఆదిలాబాద్:
యువకుని చికిత్స కోసం రూ. 50 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ మంత్రి జోగు రామన్న…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రానికి చెందిన గొల్ల పవన్ చికిత్స కోసం మాజీ మంత్రి జోగు రామన్న రూ. 50 వేల ఆర్థిక సహాయం అందించారు. పవన్ గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన పవన్ చికిత్స నిమిత్తం రూ. 5 లక్షల వరకు అవసరం కావడంతో, అతని మిత్రులు దాతల నుండి విరాళాలు పోగు చేశారు. ఇటీవలే హైదరాబాదులో శస్త్ర చికిత్స సైతం విజయవంతంగా నిర్వహించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందించి తన ఉదారత చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్సన్ లింగారెడ్డి, దుమాల దేవన్న, గణేష్ యాదవ్, పూండ్రు వెంకట్ రెడ్డి, అడెల్లు, తదితరులు ఉన్నారు.