సిరా న్యూస్, ఆదిలాబాద్
రామోజీ సేవలు చిరస్మరణీయం: మాజీ మంత్రి జోగు రామన్న
తెలుగు భాష పరిరక్షకుడిగా రామోజీ సేవలు చిరస్మరణీయం మాజీ మంత్రి జోగు రామన్నఅన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్నమాట్లాడారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని తెలిపారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత కలిగించడంతో పాటు తెలుగు భాష పరిరక్షకుడిగా పత్రికా రంగం ద్వారా రాణించి విశేష సేవలు అందించారని తెలిపారు. రామోజీ రావు లోటు ఎప్పుడు పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.