సిరాన్యూస్, జైనథ్
బాల్యమిత్రుడు జీవన్ రెడ్డిని పరామర్శించిన మాజీమంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ దీపాయిగూడకు చెందిన జీవన్ రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి. అయితే నిజామాబాద్ లోని మనోహర్ హాస్పిటల్ కు తరలించారు. శుక్రవారం బాల్య మిత్రుడైన జీవన్‌రెడ్డి పరిస్థితిని తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న నిజామాబాద్ హాస్పిటల్ కు వెళ్లి మిత్రుని కలిసి పరామర్శించారు. వైద్యులతో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి వెంట సర్పంచ్ బొల్లి గంగన్న, కృష్ణారెడ్డి, గణేష్ పండ్ల శ్రీనివాస్ ఉన్నారు.