సిరాన్యూస్, ఆదిలాబాద్
జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం: మాజీమంత్రి జోగు రామన్న
కోల్పోయిన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ వారి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మాజీమంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం కేఆర్‌కే కాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాన్ పెళ్లి గంగన్న – పోచ్చుబాయి వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు స్థానిక కేఆర్ కే కాలనీ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మాజీమంత్రి జోగు రామన్నఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదట వారి చిత్రపటాల వద్ద పూలను సమర్పించే శ్రద్ధాంజలి ఘటించారు..అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ నేడు వృద్ధాశ్రమంలో కుటుంబ సమేతంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడుతూ పేరు ప్రఖ్యాతలు పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోవర్ధన్ ఇజ్జగిరి నారాయణ నవతె శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.