సిరాన్యూస్,ఆదిలాబాద్
దేశ బడ్జెట్ కాదు.. రాజకీయ బడ్జెట్ : మాజీ మంత్రి జోగు రామన్న
కేంద్ర బడ్జెట్లో మరోసారి తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది దేశ బడ్జెట్ కాదని, రాజకీయ బడ్జెట్ అని దుయ్యబట్టారు. తెలంగాణ అస్తిత్వం పై ఏమాత్రం అవగాహన లేకుండా ప్రశ్నించే తత్వం లేనప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని స్పష్టమవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ హక్కుల కోసం పోరాడుతుందని మరోసారి రుజువైందన్నారు. ఏపీకి 15 వేల కోట్లు, బీహార్ కు 26 వేల కోట్లు, కేటాయించి పక్క రాష్ట్రం తెలంగాణపై విముకథ చూపించారన్నారు. బడ్జెట్లో మరోసారి గుండు సున్నా వేసి తెలంగాణను వెక్కిరిచ్చిందన్నారు. విద్యావ్యవస్థ గ్రామాభివృద్ధి పరిశ్రమలపై నీళ్లు చల్లింది అన్నారు. ప్రాంతీయ శక్తి బలంగా ఉంటే మన హక్కులు సాధించగలుగుతామని తెలిపారు. ఈ విషయంలో మన తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రులు ప్రశ్నించకుండా ఉండిపోవడం దేనికి సంకేతం అని నిరూపించాలన్నారు.