సిరా న్యూస్, ఆదిలాబాద్:
ఎస్పీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జోగు రామన్న
ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గౌస్ ఆలం ను మాజీ మంత్రి జోగు రామన్న మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆయన ఎస్పీకి పూల బొకే అందించి అభినందనలు తెలియజేశారు. సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేసీ, శాలువాతో సత్కరించారు. అనంతరం ఎస్పీతో పలు అంశాల గురించి చర్చించారు. ఎస్పీని కలిసిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహిర్ రంజానీ, నాయకులు గండ్రత్ రమేష్, మార్శెట్టి గోవర్ధన్, సంద నర్సింగ్, మెట్టు ప్రహల్లాద్, సాజిత్ ఉద్దీన్, రాజన్న, ఇజ్జగిరి నారాయణ, కుమ్రా రాజు, జగదీష్, పట్టణ కౌన్సిలర్లు ఉన్నారు.