సిరాన్యూస్, ఆదిలాబాద్
విఠ్టలేశ్వర రుకుం బాయి విగ్రహ ప్రతిష్టాపన
* ఆలయాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్
ఆదిలాబాద్ జిల్లా బెల్లూరిలో నూతనంగా నిర్మించిన విఠ్టలేశ్వర రుకుం బాయి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. విగ్రహ ప్రతిష్టాపన ను పురస్కరించుకుంది. ఉదయం నుండే పలు పూజాది క్రతువులను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని, ఐక్యంగా ఉంటూ వేడుకలను ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ రుకుం భాయ్ ఆమె రాసిన నవలలు పద్యాలు భక్తి భావనను మరింత రెట్టింపు చేశాయని అన్నారు . ఆయన వెంట నాయకులు ధమ్మపాల్, కొండ గణేష్, సంజయ్ తదితరులు ఉన్నారు.