Jogupremendar:విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్న గురుకులాలు:  మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్న గురుకులాలు:  మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్
నీట్ లో ప్రతిభ కనబరిచన విద్యార్థినికి స‌న్మానం

నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించి వారు ఉన్నతంగా ఎదగాలన్న బృహత్ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన గురుకులాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని బంగారిగూడలో గల బాలికల మైనారిటీ గురుకుల పాఠ‌శాలలో చదివిన హమీమా ఫెరోజ్ అనే విద్యార్థిని ఇటివల జరిగిన నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచన నేపథ్యంలో ఆమెను శుక్రవారం సత్కరించి అభినందనలు తెలియచేశారు. నీట్ పరీక్షలో 545 వ ర్యాంకు సాధించడం పట్ల పుష్పగుచ్చం అందచేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా విద్యార్థినికి మాజీ మంత్రి జోగురామన్న50 వేల రూపాయల నగదును అందించి అండగా నిలిచారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పట్టణ పరిధిలో మాజీ మంత్రి జోగు రామన్న ప్రత్యేకతచొరవతో నాలుగు మైనారిటీ గురుకులాలను స్థాపించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి అండగా ఉండాలన్న తలంపుతో యాభై వేల రూపాయల ఆర్ధిక సహకారాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఇటువంటి విజయాలను తోటి విద్యార్థులు స్పూర్తిగా తీసుకుని మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాజితుద్దీన్ యూనిస్ అక్బాని, సలీం. జోహార్, షేక్ఎస్మల్, ఆసిఫ్.ఆన్సర్,ఇస్రాల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *