Jogupremendar: గజేంద్ర నాయుడు జ్ఞాపకార్థం ర‌క్త‌దాన శిబిరం: మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
గజేంద్ర నాయుడు జ్ఞాపకార్థం ర‌క్త‌దాన శిబిరం: మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్

యువ నాయకుడు గజేంద్ర నాయుడు భౌతికంగా లేకపోయినా తన ఆశయాలను సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని, తన జ్ఞాపకార్థం ప్రతి ఏటా గణేష్ నాయుడు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. మంగళవారం రవీంద్ర నగర్ లో ఏర్పాటుచేసిన గజేంద్ర నాయుడు స్మారక జన్మదిన వేడుకలలో జోగు ప్రేమేందర్  పాల్గొన్నారు. మొదట చిత్రపటం వద్ద పూల పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం యువకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించి రక్త దాతలను అభినందించారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గజేంద్ర నాయుడు తాను నేడు మన మధ్య లేకపోయినా తాను చేసిన సేవ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని నేటికీ కొనసాగడం అభినందనీయమని పేర్కొన్నారు. గణేష్ నాయుడు చేస్తున్న కృషి పట్ల అభినందనలు తెలియజేశారు. భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా తన పేరు చిరస్మరణీయగా ఉండేలా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ యువత అన్నివేళలా ముందుండాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ నాయుడు,ప్రవీణ్ నాయుడు, నాలం సందీప్, సాయి భాక్సార్, మ‌హేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *