సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రతి ఒక్కరూ శాంతి సామరస్యంతో ఉండాలి : మాజీ మంత్రి జోగురామన్న
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు
అదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ రైతు కుటుంబాలతో పాటు యువకులకు శ్రీ కోద్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వేద పండితులతోని శాస్త్రవేత్తంగా ఉగాది పంచాంగ శ్రావణ పూజను ప్రారంభించి, కార్యకర్తలకు ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు శాంతి సామరస్యంతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో ప్రతి ఒక్కరికి సుఖసంపదలు కలగాలని కోరారు.అలాగే సనాతన హిందూ ధర్మంలో హిందూ సంస్కృతులు, హిందుత్వ పండగలను మరిన్ని తరాలకు అందించేలా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అజయ్, గోకండ్ల రమేష్, మెట్టు ప్రలాద్, ఇజ్జగిరి నారాయణ, మమత రాజన్న, కొముర రాజు, సోనేరావు, ఆశన్న ఆసిఫ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.