సిరా న్యూస్,ఆదిలాబాద్
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని సస్పెండ్: జోగురామన్న
ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఆయనపై సస్పెండ్ వేటు వేసినట్లు పేర్కొన్నారు. ఉద్యమ కాలం నాటి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఉపేక్షించేది లేదన్నారు.