సిరాన్యూస్, జైనథ్
దీపాయిగూడలో ఓటేసిన మాజీ మంత్రి జోగురామన్న
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో పిఎస్ నెంబర్ 27 లో సోమవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. పట్టణ ప్రజలు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఉదయం నుండే పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలలోని పిఎస్ లలో తిరుగుతూ అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలపై ఉందని విజ్ఞప్తి చేశారు.