సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిన వ్యక్తి జయశంకర్: మాజీ మంత్రి జోగురామన్న
తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించాలన్న సంకల్పంతో ప్రొఫెసర్ జయశంకర్ అనేక పోరాటాలు చేశారని అన్నారు. అప్పటి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మద్దతుగా నిలబడి.. ధైర్యం ఇచ్చేవారని గుర్తు చేశారు. ఆ మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, సేవ్వ జగదీష్, విజ్జగిరి నారాయణ, కౌన్సిలర్లు వెనుగంటి ప్రకాష్, బండారి సతీష్, పండ్ల శ్రీనివాస్, ధర్మ పాల్ ,రాం కుమార్ నవతే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.